గృహిణిపై యువకుల అత్యాచారయత్నం

ABN , First Publish Date - 2020-07-08T09:26:41+05:30 IST

గృహిణిపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఇద్దరు యువకులపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

గృహిణిపై యువకుల అత్యాచారయత్నం

బంజారాహిల్స్‌, జూలై 7(ఆంధ్రజ్యోతి): గృహిణిపై అత్యాచారయత్నానికి పాల్పడిన ఇద్దరు యువకులపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. రహ్మత్‌నగర్‌ ప్రాంతంలో నివసిస్తున్న ఓ మహిళ సోమవారం రాత్రి భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి ఇంట్లో నిద్రపోతోంది. ఇద్దరు యువకులు ఆమె ఇంట్లోకి చొరబడి నిద్రలేపి జుట్టుపట్టుకొని కొట్టారు. బయటకు ఈడ్చుకొచ్చి మరో ఇంట్లోకి తీసుకెళ్లి ఒకరు లైంగిక దాడికి యత్నించగా మరొకరు సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తున్నాడు. బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు వారిని అడ్డుకునేందుకు యత్నించారు. వారిని యువకులు దుర్భాషలాడారు. సమాచారం అందుకున్న పోలీసుల ఘటనా స్థలానికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-07-08T09:26:41+05:30 IST