మూడో అంతస్తు పైనుంచి పడి యువకుడి మృతి
ABN , First Publish Date - 2020-11-13T11:42:07+05:30 IST
మూడంతస్తుల భవనం పైనుంచి పడి యువకుడు మృతి చెందిన
హైదరాబాద్ : మూడంతస్తుల భవనం పైనుంచి పడి యువకుడు మృతి చెందిన సంఘటన పేట్‌బషీరాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది. ఈస్ట్ గోదావరి జిల్లా కాకినాడ మెషావాడకు చెందిన అప్పారావు కుమారుడు థామ్స్(25) జీడిమెట్ల వెంకటేశ్వరా ఎన్‌క్లేవ్‌లోని రాజరాజేశ్వరీ వసతి గృహంలో ఏడు నెలల నుంచి ఉంటూ ఏసీ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. బుధవారం రాత్రి బయట నుంచి కర్రీ, కల్లు తెచ్చుకుని, వసతి గృహంలో భోజనం తీసుకుని గదిలోకి వెళ్లాడు. కొద్ది సేపటికి మూడో అంతస్తుపై నుంచి కిందపడి మృతి చెందాడు. ప్రమాదవశాత్తు జరిగిందా..? మరేదైనా కారణం ఉందా..? అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.