ఇప్పుడే దానికి తొందరెందుకు అన్నందుకు యువకుడు ఎంత పని చేశాడంటే..!

ABN , First Publish Date - 2020-02-12T22:14:18+05:30 IST

తల్లిదండ్రులు తనకు పెళ్లి చేయడం లేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వి

ఇప్పుడే దానికి తొందరెందుకు అన్నందుకు యువకుడు ఎంత పని చేశాడంటే..!

తల్లిదండ్రులు తనకు పెళ్లి చేయడం లేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిఖిల్ గౌడ్ (24) ఉప్పల్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తూ, రామాంతపూర్‌లో తల్లిదండ్రులతో ఉంటున్నాడు. నిఖిల్ తండ్రిపేరు రామ్మోహన్ గౌడ్. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి. రెండు సంవత్సరాల క్రితమే రామ్మోహన్ గౌడ్ తన కుమార్తె వివాహం చేశారు. ఈ నేపథ్యంలో తనకు కూడా పెళ్లి చేయాలంటూ నిఖిల్ పట్టుబట్టాడు. నిఖిల్ వయసు ప్రస్తుతం 24 ఏళ్లే కావడంతో పెళ్లికి రామ్మోహన్ దంపతులు అభ్యంతరం తెలిపారు. మరికొన్ని సంవత్సరాలు ఆగాలని సూచించారు. దీంతో నిఖిల్ మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం  రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 


Updated Date - 2020-02-12T22:14:18+05:30 IST