రాంగ్‌సైడ్ డ్రైవింగ్ ప్రమాదకరం
ABN , First Publish Date - 2020-03-13T09:47:23+05:30 IST
రాంగ్‌సైడ్ డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని సీపీ అంజనీకుమార్ ట్వీట్ చేశారు. వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించకుండా రోడ్లపై జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

ప్రత్యేక డ్రైవ్‌లో 729 వాహనదారులపై చర్యలు
ట్వీట్ చేసిన సీపీ అంజనీకుమార్
హైదరాబాద్ సిటీ, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): రాంగ్‌సైడ్ డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని సీపీ అంజనీకుమార్ ట్వీట్ చేశారు. వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించకుండా రోడ్లపై జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నిబంధనల ఉల్లంఘనలో రాంగ్ సైడ్ డ్రైవింగ్ చాలా ప్రమాదకరంగా మారుతోందన్నారు. రాంగ్‌సైడ్ డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాంగ్‌సైడ్ డ్రైవింగ్‌పై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు బుధవారం నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో 729 వాహనదారులపై చర్యలు తీసుకున్నట్లు సీపీ ట్వీట్‌లో పేర్కొన్నారు.