మహిళల బరి.. పురుషుల ఓట్లపై గురి

ABN , First Publish Date - 2020-11-27T18:40:34+05:30 IST

గ్రేటర్‌ ఎన్నికల్లో అన్ని పార్టీలూ సగం సీట్లను మహిళలకు కేటాయించాయి. వారి గెలుపునకు పురుషుల ఓట్లే కీలకంగా మారాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని 150 డివిజన్లలో అడ్డగుట్ట, బన్సీలాల్‌పేటలు మినహా మిగతా 148 డివిజన్లలో పురుషుల ఓట్లే అధికంగా ఉన్నాయి.

మహిళల బరి.. పురుషుల ఓట్లపై గురి

ఆ ఏడు డివిజన్లలో అత్యధికంగా పురుషుల ఓట్లు

148 డివిజన్లలో పురుషుల ఓట్లే అధికం


హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ ఎన్నికల్లో అన్ని పార్టీలూ సగం సీట్లను మహిళలకు కేటాయించాయి. వారి గెలుపునకు పురుషుల ఓట్లే కీలకంగా మారాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని 150 డివిజన్లలో అడ్డగుట్ట, బన్సీలాల్‌పేటలు మినహా మిగతా 148 డివిజన్లలో పురుషుల ఓట్లే అధికంగా ఉన్నాయి. దాంతో కొన్ని డివిజన్లలో మహిళ అభ్యర్థుల గెలుపులో పురుషుల ఓట్లే ప్రధానమయ్యాయి. అత్యధికంగా పురుషులున్న మైలార్‌దేవ్‌పల్లి, యూసు్‌ఫగూడ, శేరిలింగంపల్లి, వెంగళరావునగర్‌, కొండాపూర్‌, మాదాపూర్‌, మియాపూర్‌, ఫతేనగర్‌, పత్తర్‌గట్టి తదితర వార్డులను పురుషులకే కేటాయించగా, కొన్ని డివిజన్లను మహిళలకు కేటాయించారు. గ్రేటర్‌లో ప్రస్తుతం మహిళలకు రిజర్వు చేసిన 75 స్థానాల్లో రెండు స్థానాల్లో మినహా మిగతా 73 స్థానాల్లో పురుషుల ఓట్లే మహిళల గెలుపునకు కీలకంగా మారాయి. ముఖ్యంగా సుభా్‌షనగర్‌, హఫీజ్‌పేట, అల్లాపూర్‌, ఖైరతాబాద్‌, సనత్‌నగర్‌, సోమాజిగూడ, ఘాన్సీబజార్‌లో మహిళల ఓట్ల కంటే పురుషుల ఓట్లు 4వేల నుంచి 6వేల వరకు అధికంగా ఉన్నాయి. మిగతా డివిజన్లలో రెండు, మూడు వేల లోపు మాత్రమే స్ర్తీల ఓట్ల కంటే పురుషుల ఓట్లు అధికంగా ఉన్నాయి. సుభా్‌షనగర్‌, హఫీజ్‌పేట, అల్లాపూర్‌, ఖైరతాబాద్‌, సనత్‌నగర్‌, సోమాజిగూడ, ఘాన్సీబజార్‌ డివిజన్లలో పురుషుల ఓట్లను రాబట్టగలిగే బలమైన అభ్యర్థుల భార్యలు, కూతుర్లను ఎన్నికల బరిలో దించారు..


డివిజన్‌         పురుషుల ఓట్లు     స్త్రీల ఓట్లు     అధికం


ఘాన్సీబజార్‌              27235 21793 5442

సుభాష్‌నగర్‌         36117 30912 5205

హఫీజ్‌పేట         37292 33005 4287

అల్లాపూర్‌          32658 28438 4220

సనత్‌నగర్‌         32413 28282 4131

సోమాజిగూడ            27050 23452 3598

ఖైరతాబాద్‌            29242 25914 3328

Read more