ఐడీహెచ్‌ కాలనీలో కరోనా పరీక్షా కేంద్రం ఏర్పాటు చేస్తాం

ABN , First Publish Date - 2020-07-14T10:25:19+05:30 IST

ఐడీహెచ్‌ కాలనీలో కరోనా పరీక్షా కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్‌

ఐడీహెచ్‌ కాలనీలో కరోనా పరీక్షా కేంద్రం ఏర్పాటు చేస్తాం

 మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌


పద్మారావునగర్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ఐడీహెచ్‌ కాలనీలో కరోనా పరీక్షా కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్థానికులకు హామీ ఇచ్చారు అంతకుముందు బోయిగూడలో ఇటీవల ప్రారంభించిన పార్కును సందర్శించారు. పార్కులోని విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను వేరే ప్రాంతానికి మార్చాలని, ఓపెన్‌ జిమ్‌, ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.


కార్యక్రమంలో కార్పొరేటర్‌ హేమలత, టీఆర్‌ఎస్‌ పద్మారావునగర్‌ ఇన్‌చార్జి గుర్రం పవన్‌కుమార్‌గౌడ్‌, జోనల్‌ కమిషనర్‌ శ్రీనివా్‌సరెడ్డి, డీసీ ముకుందారెడ్డి, ఉద్యానవనశాఖాధికారి కృష్ణ, జలమండలి జీఎం రమణారెడ్డి, విద్యుత్‌శాఖ ఏడీ బాలునాయక్‌, స్ట్రీట్‌లైట్‌ ఏడీ మహేష్‌, ఆరోగ్య అధికారి రవీందర్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు లక్ష్మీపతి, ఏసూరి మహేష్‌, వేంకటేషన్‌రాజు, ప్రేమ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-07-14T10:25:19+05:30 IST