పూల వ్యర్థాల రీసైక్లింగ్‌

ABN , First Publish Date - 2020-09-18T09:29:52+05:30 IST

గచ్చిబౌలి ట్రిపుల్‌ ఐటీ సహకారంతో అటల్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ నిధులతో కొనసాగుతున్న కాన్పూర్‌కు చెందిన పూల్‌కో స్టార్టప్‌

పూల వ్యర్థాల రీసైక్లింగ్‌

రాయదుర్గం, సెప్టెంబర్‌ 17 (ఆంధ్రజ్యోతి) : గచ్చిబౌలి ట్రిపుల్‌ ఐటీ సహకారంతో అటల్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ నిధులతో కొనసాగుతున్న కాన్పూర్‌కు చెందిన పూల్‌కో స్టార్టప్‌ కంపెనీకి శాన్‌ఫ్రాన్సిస్కో డ్రాపర్‌ రిచర్డ్‌ కప్లన్‌ ఫౌండేషన్‌ సంస్థ రూ. 10.5 కోట్లను మంజూరు చేసేందుకు ముందుకు వచ్చింది. ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన అంకిత్‌ అగర్వాల్‌ ప్రతీప్‌కుమార్‌ 2017 జూలైలో పూల్‌కో స్టార్టప్‌ను ప్రారంభించారు. అప్పుడు ట్రిపుల్‌ ఐటీ హెచ్‌ఏఐసీ రూ. 30 లక్షలు అందజేసింది. ట్రిపుల్‌ ఐటీ-హెచ్‌ఏఐసీ సహకారంతో పూల వ్యర్థాల రీసైక్లింగ్‌ ద్వారా కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేస్తోంది. ఈ సంస్థ జంతు చర్మాలకు ప్రత్యామ్నాయంగా ఈ ఉత్పత్తులను రూపొందిస్తోంది. ఈ కంపెనీ పూలు పెంచే రైతుల నుంచి ఉత్పత్తులను సేకరిస్తోంది. రైతులు ఆర్థికాభివృద్ధి సాధించడమే లక్ష్యంగా తమ ఉత్పత్తులను అభివృద్ధి చేస్తున్నామని అంకిత్‌ తెలిపారు. 

Updated Date - 2020-09-18T09:29:52+05:30 IST