గోషామహల్ ఏసీపీకి హెచ్చార్సీ నోటీసులు
ABN , First Publish Date - 2020-04-26T10:45:01+05:30 IST
అక్రమ కేసులు బనాయించారనే బాలిక ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ గోషామహల్ ఏసీపీకి నోటీసులు

హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): అక్రమ కేసులు బనాయించారనే బాలిక ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ గోషామహల్ ఏసీపీకి నోటీసులు జారీచేసింది. మే 28న హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. గోకుల్‌చాట్ పేలుళ్లలో అనాథగా మారిన బాలికను పాపాలాల్ దత్తత తీసుకున్నాడు.
పాపాలాల్ దత్తత తీసుకున్న బాలిక తన తండ్రిపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి, వేధింపులకు గురిచేస్తున్నారని.. మెయిల్ ద్వారా ఏప్రిల్ 23న హెచ్చార్సీలో ఫిర్యాదు చేసింది. కూరగాయలు కొనేందుకు వెళ్లిన తన తండ్రిపై పోలీసులు జులుం ప్రదర్శించారని.. కుటుంబాన్ని వేధిస్తున్నారని.. ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. గోషామహల్ ఏసీపీ తనను ఫోన్‌లో వేధిస్తున్నాడని ఫిర్యాదులో తెలిపింది. దీనికి స్పందించిన హెచ్చార్సీ ఏసీపీ హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీచేసింది.