వీఎస్టీలో వేతన ఒప్పందం

ABN , First Publish Date - 2020-07-27T10:15:08+05:30 IST

వీఎస్టీ యాజమాన్యం, కార్మికుల మధ్య మూడున్నర సంవత్సరాలకు సంబంధించి కుదుర్చుకున్న నూతన వేతన ఒప్పందం

వీఎస్టీలో వేతన ఒప్పందం

రాంనగర్‌, జూలై 26(ఆంధ్రజ్యోతి): వీఎస్టీ యాజమాన్యం, కార్మికుల మధ్య మూడున్నర సంవత్సరాలకు సంబంధించి కుదుర్చుకున్న నూతన వేతన ఒప్పందం దేశ కార్మికరంగ చరిత్రలో రికార్డును సృష్టించిందని మాజీ హోంశాఖ మంత్రి, వీఎస్టీ వర్కర్స్‌ యూనియన్‌ సలహదారు నాయిని నర్సింహారెడ్డి పేర్కొన్నారు.


ఆదివారం బాగ్‌లింగంపల్లిలోని వీఎస్టీ యూనియన్‌ కార్యాలయంలో వీఎస్టీ యాజమాన్యం, కార్మికుల మధ్య నూతన వేతన ఒప్పందం జరిగింది. వీఎస్టీ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు వి.శ్రీనివా్‌సరెడ్డి, ఎండీ కల్యాణ్‌ల మధ్య జరిగిన వేతన ఒప్పంద కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా నాయిని నర్సింహారెడ్డితోపాటు తెలంగాణ రాష్ట్ర జాయింట్‌ లేబర్‌ కమిషనర్‌ గంగాధర్‌ హాజరయ్యారు. వీరిద్దరి సమక్షంలో యూనియన్‌ అధ్యక్షుడు వి.శ్రీనివా్‌సరెడ్డి, కంపెనీ ఎండీ కల్యాణ్‌ ఎంవోయులు మార్చుకున్నారు. నూతన ఒప్పందం ప్రకారం కంపెనీలో పనిచేసే కార్మికులకు కనీసం రూ. 15,030 నుంచి గరిష్ఠంగా రూ.18,961 పెరుగుతుందని నాయిని తెలిపారు.

Updated Date - 2020-07-27T10:15:08+05:30 IST