వీఎస్టీ గుర్తింపు సంఘ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

ABN , First Publish Date - 2020-12-30T06:32:05+05:30 IST

నగరంలోని ప్రతిష్ఠాత్మకమైన వజీర్‌ సుల్తాన్‌ టుబాకో(వీఎస్టీ) కంపెనీ గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల నిర్వహణ కోసం హైదరాబాద్‌ జాయింట్‌ లేబర్‌ కమిషనర్‌ సి.గంగాధర్‌ మంగళవారం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు.

వీఎస్టీ గుర్తింపు సంఘ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

6న ఎన్నికలు
రాంనగర్‌, డిసెంబర్‌ 29 (ఆంధ్రజ్యోతి):
నగరంలోని ప్రతిష్ఠాత్మకమైన వజీర్‌ సుల్తాన్‌ టుబాకో(వీఎస్టీ) కంపెనీ గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల నిర్వహణ కోసం హైదరాబాద్‌ జాయింట్‌ లేబర్‌ కమిషనర్‌ సి.గంగాధర్‌ మంగళవారం ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 30వ తేదీ ఉదయం 11 నుంచి 4 గంటల వరకు నామినేషన్ల దాఖలు, అదేరోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు నామినేషన్ల పరిశీలన, 31వ తేదీ ఉదయం 11 నుంచి 4 వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటాయని తెలిపారు. అదేరోజు అభ్యర్థుల ఫైనల్‌ జాబితా విడుదల, జనవరి 6వ తేదీ ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌, సాయంత్రం ఫలితాల వెల్లడిస్తామని ఆయన తెలిపారు.

నేడు నామినేషన్లు

వీఎస్టీ కంపెనీ గుర్తింపు సంఘానికి జరిగే ఎన్నికల్లో నాయిని నర్సింహారెడ్డి ప్యానెల్‌ (ఎన్‌ఎన్‌ఆర్‌ గ్రూప్‌) నుంచి నాయిని అల్లుడు, ప్రస్తుత యూనియన్‌ అధ్యక్షుడు వి.శ్రీనివా్‌సరెడ్డి బుధవారం నామినేషన్‌ దాఖలు చేస్తారని యూనియన్‌ ప్రధాన కార్యదర్శి టి.అశోక్‌రెడ్డి, కోశాధికారి ప్రభాకర్‌ తెలిపారు. ప్రత్యర్థిగా ఐఎన్‌టీయూసీ జాతీయ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బుధవారం నామినేషన్‌ దాఖలు చేస్తున్నట్టు తెలిపారు. 

Updated Date - 2020-12-30T06:32:05+05:30 IST