కరోనా కష్టాల్లో.. వలంటీర్ల సేవలు అమోఘం

ABN , First Publish Date - 2020-05-24T10:30:38+05:30 IST

కరోనా కష్టాల్లో.. వలంటీర్ల సేవలు అమోఘమని సీపీ సజ్జనార్‌ అన్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో అండగా

కరోనా కష్టాల్లో.. వలంటీర్ల సేవలు అమోఘం

హైదరాబాద్‌ సిటీ, మే 23(ఆంధ్రజ్యోతి): కరోనా కష్టాల్లో.. వలంటీర్ల సేవలు అమోఘమని సీపీ సజ్జనార్‌ అన్నారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో అండగా నిలిచిన 225 మంది వలంటీర్లను ఆయన అభినందించారు. ప్రత్యేకంగా శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారందరికీ ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. కరోనా కష్టాల నుంచి ప్రజలను గట్టెక్కించడానికి అవసరమైన సేవలు అందించడానికి ప్రత్యేకంగా కొవిడ్‌-19 కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశాం.


కమిషనరేట్‌కు సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ దన్నుగా నిలిచిందన్నారు. ఎస్సీఎస్సీ ఆధ్వర్యంలో 225 మంది వలంటీర్లు సేవలందించారని తెలిపారు. రోజుకు 3,000ల మందికి భోజన ప్యాకెట్లు అందజేసిన స్థాయి నుంచి రోజుకు 25వేల మందికి భోజనం ఏర్పాట్లు చేసే స్థితికి చేరుకున్నామన్నారు. ఆ సేవలు అందించడానికి ముందుకొచ్చిన 225 మంది వలంటీర్లు లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించేనాటికి సుమారు 10లక్షల మందికి సేవలందించారని సీపీ తెలిపారు.

Updated Date - 2020-05-24T10:30:38+05:30 IST