వివేకానందుడి విగ్రహావిష్కరణ

ABN , First Publish Date - 2020-08-01T10:29:22+05:30 IST

వివేకానందుడి ఆశయాలను, సీనియర్‌ సిటిజన్ల అనుభవాలను ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం

వివేకానందుడి విగ్రహావిష్కరణ

ఫతేనగర్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): వివేకానందుడి ఆశయాలను, సీనియర్‌ సిటిజన్ల అనుభవాలను ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సూచించారు. శుక్రవారం ఉదయం ఫతేనగర్‌ డివిజన్‌ పరిధి భరత్‌నగర్‌ కాలనీలో స్థానిక సీనియర్‌ సిటిజన్‌ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వివేకానందుడి విగ్రహాన్ని ఆవిష్కరించి విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన సీనియర్‌ సిటిజన్‌ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పండాల సతీ్‌షగౌడ్‌, తూము  శ్రావణ్‌, సీనియర్‌ సిటిజన్‌ సభ్యులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-08-01T10:29:22+05:30 IST