వర్షంలోనూ వైరస్‌ పంజా

ABN , First Publish Date - 2020-08-20T09:32:38+05:30 IST

ముషీరాబాద్‌ నియోజకవర్గం యూపీహెచ్‌సీలలో బుధవారం 97మంది వైద్య పరీక్షలు

వర్షంలోనూ వైరస్‌ పంజా

ముషీరాబాద్‌లో 16 మందికి పాజిటివ్‌ 


నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. అయినా వైరస్‌ అనుమానితులు యాంటీజెన్‌ పరీక్షలు చేయించుకునేందుకు క్యూ కడుతూనే ఉన్నారు. ఆరోగ్య శాఖ అధికారులు బుధవారం విడుదల చేసిన బులెటిన్‌లో గ్రేటర్‌ పరిధిలో 484 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ముషీరాబాద్‌/కవాడిగూడ/చిక్కడపల్లి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ముషీరాబాద్‌ నియోజకవర్గం యూపీహెచ్‌సీలలో బుధవారం 97మంది వైద్య పరీక్షలు నిర్వహించుకోగా 13 మందికి పాజిటివ్‌ వచ్చింది. బైబిల్‌హౌస్‌ యూపీహెచ్‌సీలో 8 మందిలో ఒకరికి, భోలక్‌పూర్‌ యూపీహెచ్‌సీలో 26 మందిలో ఐదుగురికి, డీబీఆర్‌మిల్‌ యూపీహెచ్‌సీలో 27 మందిలో ముగ్గురికి, గగన్‌మహల్‌ యూపీహెచ్‌సీలో 21 మందిలో నలుగురికి, జవహర్‌నగర్‌ కమ్యూనిటీహాల్‌లో 27 మందిలో ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది. ముషీరాబాద్‌ యూపీహెచ్‌సీలో పరీక్షలు చేయించుకున్న 15 మందికి నెగెటివ్‌ వచ్చింది. 


సీతాఫల్‌మండి డివిజన్‌లో 9మందికి...

బౌద్ధనగర్‌: సీతాఫల్‌మండి డివిజన్‌ మహ్మద్‌గూడలోని రెడ్‌క్రాస్‌ ఆస్పత్రిలో 25మందికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి, సీతాఫల్‌మండి కుట్టివెల్లోడి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో 53మందిలో ఇద్దరికి, చిలకలగూడ శ్రీనివా్‌సనగర్‌ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో 42మందిలో ఐదుగురికి నిర్ధారణ పాజిటివ్‌ అయింది.


రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో 24 మందికి..

రాజేంద్రనగర్‌: రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోని శివరాంపల్లి, హసన్‌నగర్‌, మైలార్‌దేవుపల్లి అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో బుధవారం 93 మందికి పరీక్షలు చేయగా వారిలో 24మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

పాతబస్తీలోని బండ్లగూడ, మైసారం, పార్వతీనగర్‌, రక్షాపురం, బాలాగంజ్‌, పంజేషా, ఈదీబజార్‌లలోని అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌లలో 285 మందికి పరీక్షలు చేయగా 23 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.


కాచిగూడలో కరోనా పరీక్షలు..

బర్కత్‌పుర: కాచిగూడ డివిజన్‌ లింగంపల్లిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన మొబైల్‌ వాహనం వద్ద కరోనా లక్షణాలు గల వారు పరీక్షలు చేయించుకోవాలని టీఆర్‌ఎస్‌ నాయకుడు ఎక్కాల కన్నా సూ చించారు. మొబైల్‌ వాహనం ద్వారా ఉచితంగా పరీక్షలు చేసి రిపోర్టు వెంటనే ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. 

Read more