తెలంగాణ నేల.. ఘనమైన చరిత్రకు నిలయం : వినోద్‌కుమార్‌

ABN , First Publish Date - 2020-03-02T09:41:35+05:30 IST

ఘనమైన చరిత్రకు నిలయం తెలంగాణ నేల అని, ఇక్కడి చరిత్రను విశ్వవ్యాప్తం చేయాల్సిన అవసరముందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌ అన్నారు.

తెలంగాణ నేల.. ఘనమైన చరిత్రకు నిలయం : వినోద్‌కుమార్‌

రవీంద్రభారతి, మార్చి1 (ఆంధ్రజ్యోతి): ఘనమైన చరిత్రకు నిలయం తెలంగాణ నేల అని, ఇక్కడి చరిత్రను విశ్వవ్యాప్తం చేయాల్సిన అవసరముందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌ అన్నారు. రాచకొండ, దేవరకొండను పాలించిన రాజుల చరిత్ర గొప్పదని పేర్కొన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో అఖిల భారత వెలమ సంఘం ఆధ్వర్యంలో డా.పేరాల సుధాకర్‌రావు రచించిన ‘హిస్టరీ ఆఫ్‌ తెలుగు కింగ్‌డమ్స్‌ ఆఫ్‌ రాచకొండ, దేవరకొండ’ గ్రంథావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన బి.వినోద్‌కుమార్‌ గ్రంథాన్ని ఆవిష్కరించి రచయితను అభినందించారు.


అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో పాలించిన రాజులకు గొప్ప చరిత్ర ఉందన్నారు. దానిని వెలికి తీయాలని సూచించారు. విశిష్ఠ అతిథిగా హాజరైన తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా. కేవీ రమణాచారి మాట్లాడుతూ రాచకొండ, దేవరకొండ కోటలను పాలించిన రాజుల విశిష్ఠతను చాటుతూ రచించిన ఈ గ్రంథం ఈ తరానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు సభాధ్యక్షత వహించిన ఈ సభలో తక్కళ్ళపల్లి పురుషోత్తమరావు, వి.భాస్కర్‌రావు, మామిడి హరికృష్ణ, శ్రీకాంత్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-02T09:41:35+05:30 IST