మన తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా విజయకుమార్‌గౌడ్‌

ABN , First Publish Date - 2020-03-04T08:11:39+05:30 IST

మన తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా గడ్డమీది విజయకుమార్‌గౌడ్‌ ఎన్నికయ్యారు.

మన తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా విజయకుమార్‌గౌడ్‌

రాంనగర్‌, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): మన తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా   గడ్డమీది విజయకుమార్‌గౌడ్‌ ఎన్నికయ్యారు. మంగళవారం చిక్కడపల్లిలో జరిగిన మన తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో ఆయనను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గౌడ కులస్థుల సంక్షేమం, అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. త్వరలో రాష్ట్ర, జిల్లా నూతన కమిటీలను ప్రకటిస్తామని తెలిపారు. సమావేశంలో గౌడ సంఘం నేతలు హర్షవర్ధన్‌గౌడ్‌, మధుగౌడ్‌, సంతో్‌షగౌడ్‌, జి.ఆనంద్‌గౌడ్‌, శ్రీనివా్‌సగౌడ్‌, బాబుగౌడ్‌, అమర్‌నాథ్‌గౌడ్‌, రాజుగౌడ్‌, లింగంగౌడ్‌, మహేశ్వర్‌గౌడ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-04T08:11:39+05:30 IST