వీసీ పోస్టులను భర్తీ చేయాలి
ABN , First Publish Date - 2020-11-03T09:25:32+05:30 IST
రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న వీసీ పోస్టులను భర్తీ చేయాలని, ఈ పోస్టుల్లో మూడోవంతు రిజర్వుడ్ వర్గాలకు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఉన్నత
హైదరాబాద్ సిటీ, నవంబర్ 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న వీసీ పోస్టులను భర్తీ చేయాలని, ఈ పోస్టుల్లో మూడోవంతు రిజర్వుడ్ వర్గాలకు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యను నియంత్రించాలని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ డిమాండ్ చేశారు. బడుగు, బలహీన వర్గాలకు విద్యావకాశాలు అందకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ విషయంలో జాప్యం చేస్తోందని ఆరోపించారు. ఉస్మానియా యూనివర్సిటీని పాడుబడిన బంగ్లాగా మార్చి ప్రైవేట్ యూనివర్సిటీలు కోట్లు దండుకునే అవకాశాన్ని ప్రభుత్వం ఇస్తోందన్నారు.