ఉత్తరప్రదేశ్‌ ముఠాకు చెందిన..పది మంది ఘరానా దొంగలపై పీడీయాక్టు

ABN , First Publish Date - 2020-11-07T09:12:00+05:30 IST

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఘరానా దొంగల ముఠాపై సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ పీడీయాక్ట్‌ నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బూదాన్‌ జిల్లా, కాకర్ల ప్రాంతానికి చెందిన కరడుగట్టిన దొంగల ముఠా దేశవ్యాప్తంగా భారీ

ఉత్తరప్రదేశ్‌ ముఠాకు చెందిన..పది మంది ఘరానా దొంగలపై పీడీయాక్టు

హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 6 (ఆంధ్రజ్యోతి): ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఘరానా దొంగల ముఠాపై సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ పీడీయాక్ట్‌ నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బూదాన్‌ జిల్లా, కాకర్ల ప్రాంతానికి చెందిన కరడుగట్టిన దొంగల ముఠా దేశవ్యాప్తంగా భారీ చోరీలకు పాల్పడుతోంది. బంగారు దుకాణాలే లక్ష్యంగా దోపిడీలకు తెగబడుతున్న ఈ ముఠా  హైదరాబాద్‌ నగరానికి వచ్చింది. కూరగాయలు, పండ్ల వ్యాపారుల్లా నటించి డీసీఎంలో జగద్గిరిగుట్టకు చేరుకున్నారు. అక్కడ ఓ ఇల్లు అద్దెకు తీసుకుని పటాన్‌చెరు ప్రాంతంలో బంగారు దుకాణాలపై రెక్కీ నిర్వహించారు.  మరుసటి రోజు దుకాణం గోడ పగులగొట్టి చోరీకి యత్నించారు. పెట్రోలింగ్‌ సిబ్బంది, ఎస్‌వోటీ పోలీసుల సహకారంతో ముఠా సభ్యులు పదిమందిని పట్టుకుని కటాకటాల వెనక్కి నెట్టారు. దొంగలపై పీడీ యాక్ట్‌ నమోదు చేస్తూ సీపీ ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2020-11-07T09:12:00+05:30 IST