మర్డర్ టెర్రర్ ..!

ABN , First Publish Date - 2020-06-06T11:40:04+05:30 IST

రౌడీషీటర్‌తోపాటు, అతని వెంట ఉన్న మరో వ్యక్తిని కొంద రు దుండగులు దారి కాచి కత్తులతో దారుణంగా నరికి చంపారు. లంగర్‌హౌస్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఎండీ హిల్స్‌

మర్డర్ టెర్రర్ ..!

ఒక్క శుక్రవారం నాడే.. నాలుగు హత్యలు

శుక్రవారం రాత్రి.. డబుల్‌ మర్డర్‌

లంగర్‌హౌజ్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో.. 

రౌడీషీటర్‌ మహ్మద్‌ చాంద్‌  హత్య 

అతని వెంట ఉన్న చికెన్‌ వ్యాపారి కూడా..

వెంటాడి చంపిన ప్రత్యర్థులు

గోల్కొండ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో.. 

శుక్రవారం తెల్లవారుజామున

మెడికల్‌ రిప్రజెంటిటీవ్‌ రాహుల్‌ అగర్వాల్‌ హత్య

తాగించి చంపిన స్నేహితులు

స్నేహితుడి సోదరితో రాహుల్‌ ప్రవర్తనే కారణమా?

రెయిన్‌బజార్‌ స్టేషన్‌ పరిధిలో.. 

సాయంత్రం మరో యువకుడి హత్య

నడిరోడ్డుపై తల్వార్లతో దాడి.. 


పాతకక్షలు పడగ విప్పుతున్నాయి. లాక్‌డౌన్‌ వేళ చప్పుడు చేయకుండా ఉన్న రౌడీయిజం మళ్లీ తలెగరేస్తోంది. శుక్రవారం రెయిన్‌బజార్‌, లంగర్‌హౌస్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో హత్యలు జరిగిన తీరు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ఆయుధాలతో వెంటాడి మరీ చంపారు. ఒక్క శుక్రవారమే నాలుగు హత్యలు జరిగాయి. ఇవేవీ క్షణికావేశంలో కాక ఒక ప్లాన్‌ ప్రకారం జరగడం గమనించాల్సిన విషయం. గత శుక్రవారం నుంచి ఈ రోజు దాకా గడచిన వారంలో చూస్తే మొత్తం పది హత్యలు జరిగాయి. 


మే 30: రాత్రి 9.45 గంటలు.. బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మినీ నెక్లెస్‌రోడ్‌ వద్ద షేక్‌ మహమ్మద్‌ (20) అనే యువకుడి దారుణ హత్య. పాత కక్షల నేపథ్యంలో అతని ముగ్గురు స్నేహితులే గొంతుకోసి చంపేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 


మే 30-31:  అర్ధరాత్రి ఒంటి గంట... ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక వ్యక్తి నలుగురు సంతానం తర్వాత కూడా అదనపు కట్నం కోసం భార్యను వేధించాడు. బంజారాహిల్స్‌ పీఎస్‌ పరిధిలో నివాసముండే అనిల్‌ అర్ధరాత్రి పిల్లల ముందే భార్య తలపై హీటర్‌తో కొట్టి క్రూరంగా చంపాడు. 


మే 31 సాయంత్రం: గుర్తు తెలియని యువకుడిని హతమార్చి, మృతదేహాన్ని తగులబెట్టిన ఘటన బహదూర్‌పురా పీఎస్‌ పరిధిలో జరిగింది. పోలీసులు మృతుడిని, హంతకులను గుర్తించే పనిలో ఉన్నారు. 


మే 31- జూన్‌1 అర్ధరాత్రి 2గంటలు.. చాదర్‌ఘాట్‌ పీఎస్‌ పరిధిలో ఓ మహిళ విషయంలో ఇద్దరు యాచకుల మధ్య వివాదం తలెత్తింది. ఈ వివాదంలో సర్దార్‌ అనే యాచకుడు హత్యకు గురయ్యాడు. 


మే 31- జూన్‌1 అర్ధరాత్రి.. కుటుంబ కలహాల నేపథ్యంలో టీబీ ఆస్పత్రిలో డ్రైవర్‌గా పని చేస్తున్న వ్యక్తి తన భార్యను కత్తితో పొడిచి, దారుణంగా హతమార్చాడు. 

మే 31-జూన్‌1: కృష్ణ అనే ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి హత్య. స్నేహితులే హత్య చేసి,

తగుల బెట్టారు. గాంధీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో..


జూన్‌ 5: నాలుగు హత్యలు 

రౌడీషీటర్‌తోపాటు,  అతని వెంట ఉన్న మరో వ్యక్తిని కొంద రు దుండగులు దారి కాచి కత్తులతో దారుణంగా నరికి చంపారు. లంగర్‌హౌస్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఎండీ హిల్స్‌ బేకరీ వద్ద శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. గోల్కొండ పోలీ్‌సస్టేషన్‌కు చెందిన రౌడీషీటర్‌ మహ్మద్‌ చాంద్‌ (52), అతనితోపాటు ఉన్న హుమాయున్‌నగర్‌కు చెందిన ఫయాజుద్దీన్‌ అలియాస్‌ అబ్బు(38) హత్యకు గురయ్యారు. గోల్కొండ ప్రాంతానికే చెందిన మహ్మద్‌ అష్ర్‌ఫతోపాటు మరో ఐదుగురు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. పాత కక్ష లు, కొన్ని ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. రౌడీషీటర్‌ చాంద్‌కు అష్రఫ్‌ అనుచరుడు. గతంలో చాంద్‌తో కలిసి తిరిగేవాడు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో అష్రఫ్‌ దూరంగా ఉంటున్నట్టు తెలిసింది.


ఈ క్రమంలో చాంద్‌ హత్యకు గురవడం స్థానికంగా కలకలం సృష్టించింది. సమాచారం తెలుసుకున్న పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌, ఆసి్‌ఫనగర్‌ ఏసీపీ శివమారుతి, ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, యాదగిరిలు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న చాంద్‌, ఫయాజుద్దీన్‌ను సమీపంలోని ఆలీవ్‌ ఆస్పత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్‌ మెరాజ్‌హుస్సేన్‌, మాజీ మేయర్‌ మాజిద్‌హుస్సేన్‌లు ఆలీవ్‌ ఆస్పత్రి వద్దకు వచ్చారు. ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. విచారణ అనంతరం హత్యకు గల కారణాలు వెల్లడిస్తామని డీసీపీ శ్రీనివాస్‌ తెలిపారు. 


Updated Date - 2020-06-06T11:40:04+05:30 IST