టైప్‌ రైటింగ్‌ సంస్థల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : రాజశేఖర్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-12-16T04:35:53+05:30 IST

విద్యార్థులు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తున్న టైప్‌ రైటింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, పరిష్కరించడానికి కృషి చేస్తానని ఎంఎల్‌ఆర్‌ విద్యాలయాల అధిపతి, మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి

టైప్‌ రైటింగ్‌ సంస్థల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : రాజశేఖర్‌రెడ్డి
సమావేశంలో మాట్లాడుతున్న టీఆర్‌ఎస్‌ మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గం ఇంఛార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి

బోయిన్‌పల్లి, డిసెంబర్‌ 15(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తున్న టైప్‌ రైటింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, పరిష్కరించడానికి కృషి చేస్తానని ఎంఎల్‌ఆర్‌ విద్యాలయాల అధిపతి, మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. బోయిన్‌పల్లి న్యూ సిటీ కాలనీలో గల వెంకటేశ్వరస్వామి ఆలయం కల్యాణ మండపంలో మంగళవారం టీఆర్‌టీఎస్‌, సీఏ సంస్థల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మర్రి రాజశేఖర్‌రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. టైప్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. కార్యక్రమంలో టీఆర్‌టీఎస్‌ అధ్యక్షుడు బండి శ్రీనివాస్‌, ప్రదాన కార్యదర్శి బి.సతీ్‌షబాబు, బాలరాజుతో పాటు వివిధ జిల్లాల టైప్‌ రైటింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ప్రిన్సిపాల్స్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-16T04:35:53+05:30 IST