ఇద్దరు స్నాచర్ల అరెస్టు

ABN , First Publish Date - 2020-06-18T09:59:56+05:30 IST

మొబైల్‌ ఫోన్లు చోరీ చేసిన ఇద్దరు నిందితులను నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు.

ఇద్దరు స్నాచర్ల అరెస్టు

 రెండు ఫోన్లు, ద్విచక్రవాహనం స్వాధీనం


హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): మొబైల్‌ ఫోన్లు చోరీ చేసిన ఇద్దరు నిందితులను నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి ద్విచక్రవాహనం, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బేగంపేట ఇందిరమ్మనగర్‌కు చెందిన మహ్మద్‌ నుస్రత్‌పాషా(20)పలు చోరీ కేసుల్లో జైలు శిక్ష అనుభవించాడు. ప్రస్తుతం జైలు నుంచి విడుదలై బాలానగర్‌లో ఓ హార్డ్‌వేర్‌ దుకాణంలో పనిచేస్తున్నాడు.


అల్వాల్‌ కన్నోజిగూడ ప్రాంతానికి చెందిన సయ్యద్‌ సమీర్‌పాషా(23) రసూల్‌పురా ప్రాంతంలో చికెన్‌ షాపు నిర్వహిస్తున్నాడు. ఇద్దరూ చెడు అలవాట్లకు బానిసయ్యారు. సంపాదన సరిపోకపోవడంతో ఫోన్లు చోరీ చేయాలని పథకం వేశారు. ఈనెల 16వ తేదీ రాత్రి ఇద్దరూ కలిసి మద్యం తాగారు. అదేరోజు రాత్రి ఖైరతాబాద్‌ ప్రాంతానికి చెందిన వసల రాజేష్‌ ఫోన్‌ మాట్లాడుతూ పరేడ్‌గ్రౌండ్‌ నుంచి వెళ్తున్నాడు. గమనించి వారిద్దరూ బైక్‌పై అతడి వెనక వెళ్లారు.


సమీర్‌ వాహనం నడుపుతుండగా నుస్రత్‌ పాషా రాజే్‌షపై దాడి చేశాడు. కిందపడిపోయిన రాజేష్‌ నుంచి ఫోన్‌ లాక్కొని పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌ వద్ద సంచరిస్తున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారించగా నేరాన్ని అంగీకరించారు. వారి నుంచి రెండు ఫోన్లు, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితులిద్దరినీ బేగంపేట పోలీసులకు అప్పగించారు. 

Updated Date - 2020-06-18T09:59:56+05:30 IST