కన్న తండ్రిని చంపేశారు.. తండ్రికి ఉరిబిగించి చంపిన కూతుళ్లు

ABN , First Publish Date - 2020-08-12T15:31:51+05:30 IST

ఆరు నెలల క్రితం అనారోగ్యంతో తల్లి చనిపోయింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే వారిని లైంగిక వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు. మద్యం మత్తులో వారిని వేధించేవాడు.

కన్న తండ్రిని చంపేశారు.. తండ్రికి ఉరిబిగించి చంపిన కూతుళ్లు

లైంగిక వేధింపుల ఫలితం


జీడిమెట్ల, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి) : ఆరు నెలల క్రితం అనారోగ్యంతో తల్లి చనిపోయింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే వారిని లైంగిక వేధింపులకు గురి చేయడం ప్రారంభించాడు. మద్యం మత్తులో వారిని వేధించేవాడు. తండ్రి ఆగడాలు భరించలేని ఆ కూతుళ్లు తండ్రి మెడకు తాడుతో ఉరి బిగించి చంపేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన వ్యక్తి (45) రోజు కూలీ. అతడికి ఇద్దరు కూతుళ్లు (16), (17). 6 నెలల క్రితం అతడి భార్య అనారోగ్యంతో మృతి చెందింది. తాగుడుకు బానిసైన ఆ తండ్రి రోజూ తాగొచ్చి ఇంట్లో ఉన్న కూతుళ్లను లైంగికంగా హింసించేవాడు. తండ్రి ఆగడాలు భరించలేని వారు సోమవారం రాత్రి అతడి గొంతుకు తాడు బిగించి హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-08-12T15:31:51+05:30 IST