బెట్టింగ్‌ కేసులో ఇద్దరి అరెస్టు

ABN , First Publish Date - 2020-10-07T08:52:37+05:30 IST

బెట్టింగ్‌లకు పాల్పడుతున్న మరో గ్యాంగ్‌ను హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. మంగళ్‌హాట్‌ ప్రాంతానికి చెందిన శంకర్‌సింగ్‌ (

బెట్టింగ్‌ కేసులో ఇద్దరి అరెస్టు

 పరారీలో మరొకరు

హైదరాబాద్‌ సిటీ, అక్టోబర్‌ 6 (ఆంధ్రజ్యోతి): బెట్టింగ్‌లకు పాల్పడుతున్న మరో గ్యాంగ్‌ను హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. మంగళ్‌హాట్‌ ప్రాంతానికి చెందిన శంకర్‌సింగ్‌ (34) ఐపీఎల్‌ మ్యాచ్‌ల బెట్టింగ్‌ నిర్వహిస్తున్నాడు. ఇదే ఆరోపణలపై గతంలో నూ నార్సింగ్‌, మంగళ్‌హాట్‌ పోలీసులు ఇతడి ని అరెస్టు చేశారు. ఐపీఎల్‌ సందర్భంగా మళ్లీ బెట్టింగ్‌ దందా నడుపుతున్నాడు. శంకర్‌కు చాంద్రాయణగుట్టకు చెందిన ఎండీ జావీద్‌, ఎండీ ఖదీర్‌లు సహకరిస్తున్నారు.


సమాచా రం అందుకున్న సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు మంగళ్‌హాట్‌లోని స్థావరంపై దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 5.3 లక్షల నగదు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మంగళ్‌హాట్‌ పోలీసులకు అప్పగించారు. ఎండీ ఖదీర్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.


తల్లిదండ్రులూ అప్రమత్తంగా ఉండాలి : సీపీ

ఐపీఎల్‌  మ్యాచ్‌ల నేపథ్యంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ సూచించారు. యువత క్రికెట్‌ బెట్టింగ్‌లో పాల్గొనే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీపీ సూచించా రు. ఎక్కడైనా బెట్టింగ్‌ లేదా ఎలాంటి అసాంఘిక చర్యలు జరిగినా వెంటనే వాట్సాప్‌, డయల్‌ 100, ఇతర మాధ్యమాల ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. 


Read more