ఇళ్లలో చోరీలు చేస్తున్న ఇద్దరి అరెస్టు

ABN , First Publish Date - 2020-03-19T10:03:48+05:30 IST

కొన్ని నెలలుగా వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అల్వాల్‌ పోలీసులు అరెస్టు చేశారు.

ఇళ్లలో చోరీలు చేస్తున్న ఇద్దరి అరెస్టు

పది తులాల బంగారు నగలు, అరకిలో వెండి వస్తువులు, రూ. 89 వేలు స్వాధీనం 


అల్వాల్‌, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): కొన్ని నెలలుగా వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అల్వాల్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి పది తులాల బంగారు నగలు, అరకిలో వెండి వస్తువులు, రూ. 89 వేలు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఏసీపీ నరసింహారావు, ఎస్‌హెచ్‌వో పులి యాదగిరి వివరాలు వెల్లడించారు. నాందేడ్‌ ప్రాంతం బాసి గ్రామానికి చెందిన సాయిప్రసాద్‌(22), అదే ప్రాంతానికి చెందిన విశ్వజిత్‌(20) మేస్త్ర్తీలుగా పనిచేస్తూ జల్సాలకు అలవాటుపడ్డారు. బైక్‌పై బొల్లాం, అల్వాల్‌ పోలీ్‌సస్టేషన్ల ప్రాంతాల్లో తిరుగుతూ తాళం వేసిన ఇళ్లలో చోరీలు చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో బొల్లారంలో దొంగతనం చేశారు. తరువాత వరుసగా రెండు చోరీలను మేడ్చల్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చేశారు. అనంతరం వరుసగా నాలుగు దొంగతనాలను అల్వాల్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చేశారు. మంగళవారం రాత్రి అల్వాల్‌ ఇందిరాగాంధీ విగ్రహం వద్ద పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగా బైక్‌పై వెళ్తున్న వారిపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకున్నారు. వేలిముద్రలను పరిశీలించగా గతంలో వరుసగా దొంగతనాలకు పాల్పడిన నిందితులుగా గుర్తించారు. విచారించగా నేరాలు చేస్తున్నట్లు అంగీకరించారు. సాయిప్రసాద్‌, విశ్వజిత్‌ను రిమాండ్‌కు తరలించారు.  

Updated Date - 2020-03-19T10:03:48+05:30 IST