టీవీల దొంగల అరెస్టు

ABN , First Publish Date - 2020-10-24T10:21:26+05:30 IST

శ్యాంసంగ్‌ టీవీల చోరీలకు పాల్పడిన ఇద్దరు దొంగలను బేగంపేట పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 6.75 లక్షల విలువైన టీవీలతోపాటు ద్విక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు.

టీవీల దొంగల అరెస్టు

బేగంపేట, అక్టోబర్‌ 23 (ఆంధ్రజ్యోతి): శ్యాంసంగ్‌  టీవీల చోరీలకు పాల్పడిన ఇద్దరు దొంగలను బేగంపేట పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 6.75 లక్షల విలువైన టీవీలతోపాటు ద్విక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. రాంగోపాల్‌పేటకు చెందిన నీలం ప్రశాంత్‌సాయి అలియాస్‌ లడ్డూ(21) శ్యాంసంగ్‌ డీలర్‌ వద్ద కలెక్షన్‌ బాయ్‌గా పనిచేస్తున్నాడు. చుట్టాలబస్తీకి చెందిన ఽఽధన్ర్కీ థాకరే హరీందర్‌ అలియాస్‌ చోట(19) కొరియర్‌ సంస్థలో పనిచేస్తున్నాడు. ఇద్దరూ కలిసి శ్యాంసంగ్‌ సంస్థలో 27 టీవీలను చోరీచేశారు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితులను శుక్రవారం పట్టుకున్నారు. వారి నుంచి 27 టీవీలు స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2020-10-24T10:21:26+05:30 IST