టీఎ్‌సపీఎ్‌ససీ చైర్మన్‌గా బీసీలను నియమించాలి

ABN , First Publish Date - 2020-12-16T04:21:32+05:30 IST

టీఎ్‌సపీఎ్‌ససీ చైర్మన్‌గా బీసీలను నియమించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌

టీఎ్‌సపీఎ్‌ససీ చైర్మన్‌గా బీసీలను నియమించాలి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న జాజుల శ్రీనివా్‌సగౌడ్‌ తదితరులు

వృద్ధులకు (రిటైర్డ్‌ అధికారులకు) అప్పగిస్తే ఒక్క ఉద్యోగమూ భర్తీ చేయరు
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌

అంబర్‌పేట, డిసెంబర్‌ 15 (ఆంధ్రజ్యోతి): టీఎ్‌సపీఎ్‌ససీ చైర్మన్‌గా బీసీలను నియమించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వృద్ధులకు (రిటైర్డ్‌ అధికారులకు) అప్పగిస్తే ఒక్క ఉద్యోగం భర్తీ చేయరని ఆయన అన్నారు. మంగళవారం అంబర్‌పేట బీసీ హాస్టల్‌లో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏర్పడి ఎన్నో సంవత్సరాలు గడచిన బీసీలకు ఒకే ఒకసారి చైర్మన్‌ అవకాశం ఇచ్చారని అన్నారు. తిరిగి బీసీలకు ఇంత వరకు అవకాశం రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీసీలు 60 శాతం ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ఉన్నత పదవులలో బీసీలను నియమించకుండా వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. టీఎ్‌సపీఎ్‌ససీ చైర్మన్‌గా రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారిని నియమిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, పోలీసు అధికారిని ఈ పోస్టులో ఎలా నియమిస్తారని ఆయన ప్రశ్నించారు. టీఎ్‌సపీఎ్‌ససీ నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఏర్పాటైన సంస్థ అని దీనికి పోలీసు అధికారిని కాకుండా ఒక అకడమిక్‌ అధికారిని చైర్మన్‌గా నియమించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో బీసీ సంఘాల నాయకులు బడేసాబ్‌, వరికుప్పల మధు, కొట్ర ప్రభాకర్‌, చందు,రాజు, పరమేష్‌, నరేందర్‌, శరత్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more