7 నుంచి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఉచిత శిక్షణ
ABN , First Publish Date - 2020-10-04T09:52:55+05:30 IST
7 నుంచి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఉచిత శిక్షణ
కుషాయిగూడ, అక్టోబర్ 3 (ఆంధ్రజ్యోతి): చర్లపల్లిలోని కేంద్ర రసాయనాలు, పెట్రో రసాయనా ల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సెంట్ర ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(సీపెట్)లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న ఆరు నెలల ఉచిత శిక్షణ కోర్సులు అక్టోబరు 7 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సంస్థ డైరెక్టర్ వి.కిరణ్‌కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. కనీసం ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత మొదలుకొని టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ, బీటెక్ విద్యార్హత గలవారు ఎవరైనా 18 నుంచి 30 ఏళ్లలోపు వయసు ఉన్న వారు ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ పథకం కింద నగరంలోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) సౌజన్యంతో అందజేస్తున్న ఈ శిక్షణా కాలంలో అభ్యర్థులకు ఉచిత వసతి, భోజనంతోపాటు యూనిఫాం, కోర్సు మెటీరియల్ అందజేస్తున్నట్లు వివరించారు. ఆసక్తి కలిగిన వారు ఈనెల 5లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు ఫోన్ 9959333417, 9959333415 నంబర్లలో సంప్రదించాలని కోరారు.