కేంద్రమంత్రులు రావాల్సిన అవసరం ఏంటి?: నామా

ABN , First Publish Date - 2020-11-27T18:13:38+05:30 IST

: ప్రతిపక్షాల మాటల్లో వాస్తవాలు ఉండాలని టీఆర్ఎస్ నేత నామా నాగేశ్వర్‌రావు హితవు పలికారు

కేంద్రమంత్రులు రావాల్సిన అవసరం ఏంటి?: నామా

హైదరాబాద్: ప్రతిపక్షాల మాటల్లో వాస్తవాలు ఉండాలని  టీఆర్ఎస్ నేత నామా నాగేశ్వర్‌రావు హితవు పలికారు. బండి సంజయ్ ఒక్క సారైనా రాష్ట్ర అభివృద్ధి గురించి పార్లమెంట్‌లో మాట్లాడారా? అని ప్రశ్నించారు. గ్రేటర్‌లో జిమ్మిక్కులు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ నుంచి కేంద్రానికి ఆరేళ్లలో రూ.2లక్షల75 వేల కోట్లు వెళ్లాయని... హైద్రాబాద్ చుట్టూ 22 టోల్ గేట్లు పెట్టి వసూలు చేస్తున్నారని తెలిపారు. తమకు కేంద్రం కేవలం 30 శాతం మాత్రమే ఇచ్చారని తెలిపారు. 


తెలంగాణ నిధులను బీహార్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో ఖర్చు చేస్తున్నారని ఆయన విమర్శించాు. కేంద్రమంత్రులు జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఈ మంత్రులంతా తెలంగాణకు ఏమిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆర్‌ఆర్‌ఆర్ కోసం విజ్ఞప్తి చేసిన కేంద్రం అనుమతి ఇవ్వలేదన్నారు. అభివృద్ధిని అడ్డుకుని ఓట్లు ఎలా అడుగుతారని నామా నాగేశ్వర్‌రావు ప్రశ్నించారు. 

Read more