అనారోగ్యంతో టీఆర్‌ఎస్‌ నాయకుడి మృతి

ABN , First Publish Date - 2020-07-10T09:52:59+05:30 IST

అనారోగ్యంతో టీఆర్‌ఎస్‌ నాయకుడు మృతిచెందాడు. సీతాఫల్‌మండి మేడిబావికి చెందిన నారపాక నగేష్‌(46) టీఆర్‌ఎస్‌ నాయకుడు

అనారోగ్యంతో టీఆర్‌ఎస్‌ నాయకుడి మృతి

బౌద్ధనగర్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి): అనారోగ్యంతో టీఆర్‌ఎస్‌ నాయకుడు మృతిచెందాడు. సీతాఫల్‌మండి మేడిబావికి చెందిన నారపాక నగేష్‌(46) టీఆర్‌ఎస్‌ నాయకుడు. గతంలో టీడీపీ బౌద్ధనగర్‌ డివిజన్‌ అధ్యక్షుడికి రెండుసార్లు పనిచేశారు. గురువారం ఉదయం ఐదు గంటలకు మృతి చెందాడు. మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ భౌతికకాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌, కార్పొరేటర్లు సామల హేమ, ధనంజనగౌడ్‌, నాయకులు మేకల సారంగపాణి, పవన్‌కుమార్‌గౌడ్‌, రాచమల్ల కృష్ణమూర్తి, కాంగ్రెస్‌ పార్టీ బౌద్ధనగర్‌ డివిజన్‌ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ తదితరులు నగేష్‌ మృతికి సంతాపం తెలిపారు. 

Updated Date - 2020-07-10T09:52:59+05:30 IST