హీరోయిన్ అవకాశం ఇప్పిస్తానంటూ యువతులకు వల
ABN , First Publish Date - 2020-07-10T09:59:29+05:30 IST
ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో తాను ప్రముఖ సంస్థలో డిజైనర్, మేక్‌పమన్‌గా పనిచేస్తున్నానని చెప్పుకుంటూ, ప్రముఖ హీరో

హైదరాబాద్ సిటీ, జూలై 9 (ఆంధ్రజ్యోతి): ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో తాను ప్రముఖ సంస్థలో డిజైనర్, మేక్‌పమన్‌గా పనిచేస్తున్నానని చెప్పుకుంటూ, ప్రముఖ హీరో సరసన హీరోయిన్‌గా నటించేందుకు అవకాశం ఇప్పిస్తానంటూ యువతులకు వల వేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సదరు సంస్థ ప్రతినిధులు తమ సంస్థ పేరును ఉపయోగించుకొని, యువతులను మోసం చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం.