శానిటైజ్‌ చేయకుండానే శిక్షణా..?

ABN , First Publish Date - 2020-10-07T08:42:43+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన అన్‌లాక్‌డౌన్‌ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలోని క్రీడా మైదానాలు, సముదాయాలను తెరవాల్సిందిగా క్రీడాశాఖ

శానిటైజ్‌ చేయకుండానే శిక్షణా..?

 హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన అన్‌లాక్‌డౌన్‌ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలోని క్రీడా మైదానాలు, సముదాయాలను తెరవాల్సిందిగా క్రీడాశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ ఆదేశాలిచ్చారు. అయితే, ఇందుకు అవసరమైన సన్నద్ధత లేకుండానే స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ (శాట్స్‌) స్టేడియాలను తెరిచి ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. కరోనా కారణంగా దాదాపు ఏడు నెలలు స్టేడియాలు మూతపడ్డాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా కేసులు వేగంగా పెరుగుతుంటే నగరంలోని వివిధ స్టేడియాల్లో కనీసం శానిటైజ్‌ కూడా చేయకుండానే శిక్షణ ప్రారంభించారు.


హైదరాబాద్‌లోని ప్రధాన స్టేడియాల్లో వేటికీ కూడా ఇప్పటివరకు అవసరమైన శానిటైజేషన్‌ సామగ్రిని శాట్స్‌ పంపలేదని సమాచారం. ప్రధాన స్టేడియాల్లో ప్రతి క్రీడకూ ఒక ప్రత్యేక హాల్‌ ఉంటుంది. వీటి ముందు శానిటైజర్‌ స్టాండ్‌ కానీ, సాధనకు వచ్చే క్రీడాకారుల శరీర ఉష్ణోగ్రతను పరీక్షించే థర్మోమీటర్లు కానీ ఏర్పాటు చేయలేదు.

దీనిపై సంబంధిత కోచ్‌లను ప్రశ్నిస్తే డిపార్ట్‌మెంట్‌ నుంచి ఎలాంటి నిధులు, శానిటైజేషన్‌ సామగ్రి తమకు అందలేదని చెబుతున్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా శిక్షణ కార్యక్రమాలు పునరుద్ధరించడం వల్ల క్రీడాకారుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2020-10-07T08:42:43+05:30 IST