రేపు, ఎల్లుండి నీటి సరఫరాలో అంతరాయం
ABN , First Publish Date - 2020-12-15T05:45:27+05:30 IST
కృష్ణా ఫేజ్-1 పైపులైన్ల మరమ్మతుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో రెండు రోజులపాటు మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని

హైదరాబాద్ సిటీ, డిసెంబర్ 14 (ఆంధ్రజ్యోతి): కృష్ణా ఫేజ్-1 పైపులైన్ల మరమ్మతుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో రెండు రోజులపాటు మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని వాటర్ బోర్డు అధికారులు తెలిపారు. ముఖ్యంగా పాతబస్తీతోపాటు కోర్‌సిటీలోని పలు ప్రాంతాలకు బుధ, గురువారాల్లో నీటి సరఫరా నిలిచిపోనుంది. కృష్ణా ఫేజ్-1 కోదండపూర్, నాసర్లపల్లి, గొడకండ్ల గ్రామాల వద్ద గల పంపు హౌస్‌లలో 600ఎంఎం డయా పైపులైన్‌పై వాల్వులు అమర్చడం, 300ఎంఎం డయా పైపులైన్ లీకేజీని అరికట్టడం కోసం కేడీడబ్ల్యూఎ్‌సపీ ఫేజ్-1 కోదండపూర్ నుంచి గొడకండ్ల వరకు గల పైపులైన్‌కు పలు ప్రాంతాల్లో మరమ్మతులు, తదితర పనులను వాటర్‌బోర్డు చేపట్టనుంది. దీంతో బుధవారం ఉదయం 6 నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. మీరాలం, కిషన్‌బాగ్, బాల్‌షెట్టికేత్, అల్జుబైల్ కాలనీ, అలియాబాద్, హషమాబాద్, రియాసత్‌నగర్, సంతో్‌షనగర్, వినయ్‌నగర్, సైదాబాద్, ఆస్మాన్‌ఘడ్, దిల్‌సుఖ్‌నగర్, చంచల్‌గూడ, యాకుత్‌పురా, మెహబూబ్‌మాన్షన్, బొగ్గులకుంట, అఫ్జల్‌గంజ్, హిందీనగర్, నారాయణగూడ, అడిక్‌మెట్, శివంరోడ్, చిలకలగూడ రిజర్వాయర్ ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు.