హెచ్‌సీయూ పూర్వ ఆచార్యులకు లైఫ్‌టైమ్‌ కంట్ర్యూభూషన్‌ అవార్డు

ABN , First Publish Date - 2020-09-13T08:54:25+05:30 IST

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి చెందిన పూర్వ ఆచార్యులు కె.ఆనంత పద్మనాభన్‌కు లైఫ్‌టైమ్‌ కంట్ర్యూభూషన్‌ అవార్డు ..

హెచ్‌సీయూ పూర్వ ఆచార్యులకు  లైఫ్‌టైమ్‌ కంట్ర్యూభూషన్‌ అవార్డు

గచ్చిబౌలి, సెప్టెంబర్‌ 12(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి చెందిన పూర్వ ఆచార్యులు కె.ఆనంత పద్మనాభన్‌కు లైఫ్‌టైమ్‌ కంట్ర్యూభూషన్‌ అవార్డు లభించిందని వర్సిటీ అధికారులు తెలిపారు. ప్రతి సంవత్సరం విశిష్ట సేవలు అందించిన ప్రొఫెసర్లను ఇండియన్‌ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ సంస్థ లైఫ్‌టైమ్‌ అవార్డుతో సత్కరిస్తోంది. 2020 సంవత్సరానికి గాను ఈ అవార్డుకు వర్సిటీ పూర్వ ఆచార్యులు ఆనంతపద్మనాభన్‌ ఎంపికయ్యారు. ఈయన నానోటెక్నాలజీ, మెటల్స్‌, ఇంజనీరింగ్‌ రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. ఈయన అభివృద్ధి చేసిన టెక్నాలజీని దేశంలోని పేరొందిన పరిశ్రమల్లో వినియోగిస్తున్నాయని తెలిపారు. ఆయన కృషికి గాను ఈ వార్డు లభించిందని పేర్కొన్నారు.  

Updated Date - 2020-09-13T08:54:25+05:30 IST