ప్రతీ ఒక్కరూ బాధ్యతాయుతంగా ఓటు వేయాలి: కోదండరాం
ABN , First Publish Date - 2020-12-01T15:22:53+05:30 IST
ప్రతీ ఒక్కరూ బాధ్యతాయుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు.
హైదరాబాద్: ప్రతీ ఒక్కరూ బాధ్యతాయుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. తార్నాకలోని వెల్ఫేర్ అసోసియేషన్ పోలింగ్ కేంద్రానికి హాజరైన కోదండరాం తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా స్వామ్యంలో ఓటు శక్తివంతమైనదని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోదండరాం సూచించారు.