తెల్లవారుజామున వైన్‌షాపు పైకి ఎక్కి.. రేకులు తొలగించి.. లోపలికి వెళ్లి..
ABN , First Publish Date - 2020-04-05T15:53:37+05:30 IST
బోయిగూడలోని వైన్‌షాపులో ఓ దొంగ విలువైన మద్యం, నగదు అపహరించాడు. గాంధీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గాంధీ ఆసుపత్రి ఎదురుగా భారత్‌గ్యాస్ ఏజెన్సీ

మద్యం చోరీ.. వైన్‌షాపు రేకులు తొలగించి లోనికి చొరబడ్డ దొంగ
కవాడిగూడ, హైదరాబాద్(ఆంధ్రజ్యోతి) : బోయిగూడలోని వైన్‌షాపులో ఓ దొంగ విలువైన మద్యం, నగదు అపహరించాడు. గాంధీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గాంధీ ఆసుపత్రి ఎదురుగా భారత్‌గ్యాస్ ఏజెన్సీ పక్కన శ్రీ వెంకటేశ్వర వైన్‌షాపు ఉంది. లాక్డౌన్ నేపథ్యంలో గత నెల 21 నుంచీ మూసి ఉంది. ఈ నెల ఒకటో తేదీ తెల్లవారు జామున వైన్‌షాపు పైకి ఎక్కిన ఓ దొంగ రేకులు తొలగించి లోనికి ప్రవేశించాడు. మద్యం, నగదు దొంగిలించాడు. ఈ వైన్‌షాపులో ఎనిమిది సీసీ కెమెరాలు ఉన్నాయి. అవి యజమానుల సెల్ఫోన్లకు లింక్ చేసి ఉన్నాయి. షాపులో మూడు సీసీ కెమెరాల ఫుటేజీలు రాకపోవడంతో అనుమానం వచ్చిన యజమాని రమేష్‌గౌడ్ గాంధీనగర్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు.
పోలీసులు వైన్‌షాపు వద్దకు వెళ్లి విచారణ చేయగా దొంగలు పడ్డారని గుర్తించారు. స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజీలు చూడగా పై కప్పు తొలగించి షాపులోనికి వెళ్లిన దొంగ విజువల్స్ కనిపించాయి. రూ.26 వేల విలువైన మద్యం, రూ. 8 వేల నగదు చోరీకి గురైనట్లు పోలీసులు తెలపగా.. వైన్‌షాపు యాజమాన్యం మాత్రం తమ షాపులో 70 వేల విలువ చేసే మద్యం సీసాలు. రూ 15 వేల నగదు పోయిందని పేర్కొంటున్నారు.