హైదరాబాద్‌లో పక్కింటి వ్యక్తికి కరోనా సోకిందని సొంతూరికెళ్తే..
ABN , First Publish Date - 2020-09-03T18:42:21+05:30 IST
ఇంటి పక్కనే ఉండే వ్యక్తికి కరోనా సోకింది. భయపడిన ఓ కుటుంబం ఊరెళ్లింది. తిరిగి వచ్చేసరికి దొంగలు ఇంట్లో చోరీ చేశారు. యూసు్‌ఫగూడ లక్ష్మీనర్సింహనగర్‌లో నివసిస్తున్న

ఇంట్లో నగలు అపహరణ
బంజారాహిల్స్, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): ఇంటి పక్కనే ఉండే వ్యక్తికి కరోనా సోకింది. భయపడిన ఓ కుటుంబం ఊరెళ్లింది. తిరిగి వచ్చేసరికి దొంగలు ఇంట్లో చోరీ చేశారు. యూసు్‌ఫగూడ లక్ష్మీనర్సింహనగర్‌లో నివసిస్తున్న శ్యాం సత్య మణికంఠ ప్రైవేట్ ఉద్యోగి. అతడి ఇంటి పక్కనే ఉండే ఓ వ్యక్తికి ఇటీవల కరోనా బారినపడ్డాడు. దీంతో శ్యాం కుటుంబం భయంతో సోదరి ఇంటికి వెళ్లింది. రెండు రోజుల తర్వాత తిరిగి రాగా కిటికీ తెరిచి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువాలో భద్రపరిచిన రెండు తులాల బంగారు గొలుసు, 5 గ్రాములు పాపిడి చైన్, 6 గ్రాములు మాటీలు, 12 గ్రాముల బంగారం ముక్కలు కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.