బతకాలని లేదంటూ లేఖ రాసి మహిళ అదృశ్యం

ABN , First Publish Date - 2020-03-13T10:00:13+05:30 IST

బతకాలని లేదంటూ లేఖ రాసి ఓ మహిళ కనిపించకుండాపోయింది. మారుతీనగర్‌కు చెందిన వై. మంజుల(21), బాబు భార్యాభర్తలు. వీరికి రెండేళ్ల క్రితం వివాహం అయింది. బాబు బంజారాహిల్స్‌లోగల శ్రీకృష్ణ జువెలరీలో పనిచేస్తున్నాడు.

బతకాలని లేదంటూ లేఖ రాసి మహిళ అదృశ్యం

ఖైరతాబాద్‌, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): బతకాలని లేదంటూ లేఖ రాసి ఓ మహిళ కనిపించకుండాపోయింది. మారుతీనగర్‌కు చెందిన వై. మంజుల(21), బాబు భార్యాభర్తలు. వీరికి రెండేళ్ల క్రితం వివాహం అయింది. బాబు బంజారాహిల్స్‌లోగల శ్రీకృష్ణ జువెలరీలో పనిచేస్తున్నాడు. వీరు మొదట ఎస్‌ఆర్‌నగర్‌లో అద్దె ఇంట్లో ఉన్నారు. కొద్దిరోజుల క్రితం ఖైరతాబాద్‌ మారుతీనగర్‌కు మకాం మార్చారు.


బాబు బుధవారం ఉదయం 8.30 గంటలకు విధులకు వెళ్లి రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చేసరికి భార్య కనిపించలేదు. ఇంట్లో ఓ లేఖ కనిపించింది. ‘అమ్మా.. వద్దందటే వినలేదు.. నన్ను వెళ్లమన్నారు.. అవే మాటలు.. చాలా బాధగా ఉంది. బతకాలని లేదు’ అని అందులో రాసి ఉంది. లేఖను బాబు, బంధువులు పోలీసులకు అందజేశారు. ఆమె భర్తతోపాటు కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. మంజుల ఆచూకీ లభిస్తే సైఫాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌కు లేదా 9490616897 నంబర్‌ ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ సైదిరెడ్డి కోరారు.

Updated Date - 2020-03-13T10:00:13+05:30 IST