నగరంలో రెక్కల పురుగుల గోల..

ABN , First Publish Date - 2020-06-21T09:44:53+05:30 IST

నైరుతి రుతుపవనాలు నగరంలోకి వారం రోజుల క్రితం వచ్చిన నేపథ్యంలో చల్లని వాతావరణం ఏర్పడింది

నగరంలో రెక్కల పురుగుల గోల..

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు నగరంలోకి వారం రోజుల క్రితం వచ్చిన నేపథ్యంలో చల్లని వాతావరణం ఏర్పడింది. 20రోజుల క్రితం వరకు ఎండ వేడి, ఉక్కపోతతో సతమతమైన నగరవాసులు వారం రోజులుగా చిరు జల్లుల నుంచి ఓ మోస్తారుగా కురుస్తున్న వర్షాలతో కొద్దిగా ఇబ్బందులు పడుతున్నారు. విదేశాల నుంచి వచ్చే మిడతలతో ప్రమాదం పొంచి ఉందని భయపడిన నగర వాసులు..  ప్రస్తుతం తెల్లని పురుగులతో అవస్థలు పడుతున్నారు. గతంలో వర్షాలు పడితే ఉసిల్లు రాగా, ఇప్పుడు తెల్లని పురుగులు ఇళ్లలోకి చొరబడి ఆగం చేస్తున్నాయని నగరంలోని మెహదీపట్నం, లంగర్‌హౌజ్‌, సికింద్రాబాద్‌, హబ్సిగూడ, అంబర్‌పేట్‌, తదితర ప్రాంతాల ప్రజలు వాపోతున్నారు. మూసీ పరివాక ప్రాంతాల్లో లైట్‌ వేయగానే చుట్టూ చేరిపోతున్నాయి. వీటిని పారదోలేందుకు జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - 2020-06-21T09:44:53+05:30 IST