‘25 గ్రేస్‌ మార్కులను’ కలపాలని విద్యాశాఖ మంత్రికి వినతి

ABN , First Publish Date - 2020-03-18T09:35:01+05:30 IST

కరోనా వైర్‌సను జాతీయ విపత్తుగా ప్రకటించడంతో తెలంగాణలో జరుగుతున్న పది, ఇంటర్‌, డిగ్రీ, పీజీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ‘25 గ్రేస్‌ మార్కులను’ కలపాలని కోరుతూ గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌, గడ్డం గంగాధర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం మంగళవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి వినతిపత్రం అందజేసింది.

‘25 గ్రేస్‌ మార్కులను’ కలపాలని విద్యాశాఖ మంత్రికి వినతి

అఫ్జల్‌గంజ్‌, మార్చి17 (ఆంధ్రజ్యోతి) : కరోనా వైర్‌సను జాతీయ విపత్తుగా ప్రకటించడంతో తెలంగాణలో జరుగుతున్న పది, ఇంటర్‌, డిగ్రీ, పీజీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ‘25 గ్రేస్‌ మార్కులను’ కలపాలని కోరుతూ గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌, గడ్డం గంగాధర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం మంగళవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా శ్రీనివా్‌సయాదవ్‌ మాట్లాడుతూ యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ కేసులు తెలంగాణలో కూడా పాజిటివ్‌గా నమోదవుతుండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు సరిగా చదవడం లేదని, ఈ విషయంలో మంత్రి మానవీయ కోణంలో స్పందించి పబ్లిక్‌ పరీక్షలు రేసే విద్యార్థులకు ‘25 గ్రేస్‌ మార్కులు’ కలపాలని ఆయన కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో ఫౌండేషన్‌ ప్రతినిధులు తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-03-18T09:35:01+05:30 IST