ప్రాణాలు కాపాడిన పోలీసులు

ABN , First Publish Date - 2020-04-21T10:34:40+05:30 IST

ప్రసవం కోసం గర్భిణి మలక్‌పేట ఏరియా ఆస్పత్రిలో చేరింది. ఆమె పరిస్థితి విషమించిన విషయం

ప్రాణాలు కాపాడిన పోలీసులు

మలక్‌పేట ఆస్పత్రిలో గర్భిణి ప్రసవ వేదన

పరిస్థితి విషమం

వెంటనే కోఠి ప్రసూతి ఆస్పత్రికి తరలింపు

ఆడ శిశువుకు జన్మనిచ్చిన మహిళ


చాదర్‌ఘాట్‌, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): ప్రసవం కోసం గర్భిణి మలక్‌పేట ఏరియా ఆస్పత్రిలో చేరింది. ఆమె పరిస్థితి విషమించిన విషయం తెలుసుకున్న చాదర్‌ఘాట్‌ పోలీసులు వెంటనే కోఠిలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి తరలించారు. ఆడ శిశువుకు జన్మనిచ్చింది. హయత్‌నగర్‌ నివాసి జుబేరియా బేగం ఆదివారం ఉదయం 10 గంటల కు ప్రసవం కోసం  మలక్‌పేట ఏరియా ఆస్పత్రిలో చేరింది. రాత్రి 10.30 గంటలకు పురిటి నొప్పులు మొదలయ్యాయి.


ప్రసవ సమయంలో పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే కోఠిలోని ఆస్పత్రికి తీసుకెళ్లమని కుటుంబ సభ్యులకు వైద్యులు సూచించారు. డయల్‌ 100కు కాల్‌ చేయగా డ్యూటీలో ఉన్న చాదర్‌ఘాట్‌ పీఎస్‌ పెట్రో కార్‌-1 కానిస్టేబుల్స్‌ ప్రశాంత్‌, అక్బర్‌, హోంగార్డ్‌ శ్రీను మలక్‌పేట ఆస్పత్రికి చేరుకున్నారు.  పురిటి నొప్పులతో బాధపడుతున్న జుబేరియా బేగంను కోఠి ఆస్పత్రికి తరలించగా అక్కడ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. 

Updated Date - 2020-04-21T10:34:40+05:30 IST