జర్నలిస్టుల సేవలు అభినందనీయం

ABN , First Publish Date - 2020-06-26T09:56:24+05:30 IST

లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ సమాచార సేకరణలో జర్నలిస్టులు చేసిన సేవలు అభినందనీయమని

జర్నలిస్టుల సేవలు అభినందనీయం

ఎమ్మెల్యే సుభా్‌షరెడ్డి


ఉప్పల్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ సమాచార సేకరణలో జర్నలిస్టులు చేసిన సేవలు అభినందనీయమని ఉప్పల్‌ ఎమ్మెల్యే భేతి సుభా్‌షరెడ్డి అన్నారు. మంగళవారం ఉప్పల్‌లోని ఎన్‌ఎ్‌సఎల్‌ ఇన్‌ఫ్రాటెక్‌ సెజ్‌లో ఉప్పల్‌ పోలీసుల సహకారంతో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ డాక్టర్లు, పారిశుధ్య సిబ్బంది, మెడికల్‌ సిబ్బంది, పోలీసులతో పాటు జర్నలిస్టులు కూడా తమ ప్రాణాలను లెక్క చేయకుండా సమాచార సేకరణకు కృషి చేశారన్నారు. మల్కాజిగిరి జోన్‌ డీసీసీ రక్షితామూర్తి మాట్లాడుతూ లాక్‌డౌన్‌ సమయంలో పోలీసులకు చేదోడువాదోడుగా ఉంటూ ప్రజలకు సేవలు అందించడంలో జర్నలిస్టులు చేసిన కృషిని అభినందించారు. కార్యక్రమంలో ఎన్‌ఎ్‌సఎల్‌ ఇన్‌ఫ్రాటెక్‌ డైరెక్టర్‌ ఎం.ఐశ్వర్య, ప్రాజెక్ట్‌ హెడ్‌ సతీ్‌షకుమార్‌, ఎన్‌ఎ్‌సఎల్‌ గ్రూపు జీఎం మధుబాబు, ఉప్పల్‌ ఇన్‌స్పెక్టర్‌ రంగస్వామి, అడ్మిన్‌ ఎస్సై జయరామ్‌, జర్నలిస్టులు పాల్గొన్నారు.

Updated Date - 2020-06-26T09:56:24+05:30 IST