శానిటరీ సూపర్‌వైజర్ ఇంట్లో చోరీ
ABN , First Publish Date - 2020-05-18T09:23:16+05:30 IST
బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేసరికి దుండగులు ఇంటి తాళం పగులగొట్టి రూ. 5 లక్షలు, 4 తులాల బంగారం చోరీ చేశారు.

రూ. 5 లక్షలు, 4 తులాల బంగారం అపహరణ
జీడిమెట్ల, మే 17 (ఆంధ్రజ్యోతి): బంధువుల ఇంటికి వెళ్లి వచ్చేసరికి దుండగులు ఇంటి తాళం పగులగొట్టి రూ. 5 లక్షలు, 4 తులాల బంగారం చోరీ చేశారు. కుత్బుల్లాపూర్ మునిసిపాలిటీలో శానిటరీ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న రాజేశ్‌సింగ్ కుటుంబసభ్యులతో ఎస్‌ఆర్‌నాయక్‌నగర్‌లో నివసిస్తున్నాడు. వారం రోజుల క్రితం తన సోదరుడు మృతి చెందడంతో ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి చేవెళ్ల వెళ్లారు. ఆదివారం ఉదయం అతడి ఇంటి తాళాలు తీసి ఉండడంతో ఇంటిపక్కనున్న వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. లోపలికి వెళ్లి చూడగా బీరువా పగులగొట్టి ఉండడంతో రాజేశ్‌కు సమాచారం ఇవ్వగా వెంటనే ఇంటికి వచ్చాడు. రూ. 5 లక్షలు, నాలుగు తులాల బంగారం చోరీ అయినట్లు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.