‘డయాలిసిస్‌ రోగుల సమస్యలు పరిష్కరించాలి’

ABN , First Publish Date - 2020-10-12T10:07:50+05:30 IST

డయాలిసిస్‌ రోగుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ కిడ్నీ పేషెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు

‘డయాలిసిస్‌ రోగుల సమస్యలు పరిష్కరించాలి’

సనత్‌నగర్‌, అక్టోబర్‌ 11 (ఆంధ్రజ్యోతి): డయాలిసిస్‌ రోగుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ కిడ్నీ పేషెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్‌ కోరారు. ఆదివారం పంజాగుట్టలోని నిమ్స్‌ ఆస్పత్రిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కొన్నేళ్లుగా నిమ్స్‌లో డయాలిసిస్‌ రోగులకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేశారని, కొన్ని రోజులుగా రక్తపరీక్షలకు ఫీజులు వసూలు చేస్తున్నారని పేర్కొనారు. డయాలిసిస్‌ అయిన తర్వాత రక్త పరీక్షల రిపోర్టు ఇవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నారన్నారు. దీంతో రోగులు ఇబ్బందులకు గురవుతున్నారని, ఆ రిపోర్టులు రుసుం లేకుండా వేగంగా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కిడ్నీ పేషంట్స్‌ అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.  


Updated Date - 2020-10-12T10:07:50+05:30 IST