ఇంటి తాళాలు పగులగొట్టి..

ABN , First Publish Date - 2020-09-06T09:42:29+05:30 IST

ఇంట్లో ఎవరూ లేకుండా చూసి దొంగలు పట్టపగలే రెచ్చిపోయారు.

ఇంటి తాళాలు పగులగొట్టి..

బర్కత్‌పుర, సెప్టెంబర్‌ 5 (ఆంధ్రజ్యోతి): ఇంట్లో ఎవరూ లేకుండా చూసి దొంగలు పట్టపగలే రెచ్చిపోయారు. తాళాలు పగుల గొట్టి బీరువాలోని బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. కాచిగూడ పీఎస్‌ డీఐ యాదేందర్‌ కథనం ప్రకారం. కుత్బీగూడలో నివాసం ఉంటున్న లలిత్‌దా్‌స (33) బం గారం దుకాణంలో పనిచేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం లలిత్‌దా్‌స ఇంటికి తాళం వేసి దుకాణానికి వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలోని 41 గ్రాముల బంగారు ఆభరణాలు, అర కేజీ వెండి ఆభరణాలను దొంగలించారు. రాత్రి ఇంటికి వచ్చిన లలిత్‌దా్‌స తలుపులు తీసి ఉండటంతో ఆందోళన చెంది, లోనికి వెళ్లి చూడగా బీరువాలోని బంగారు, వెండి ఆభరణాలు కనిపించలేదు. వెంటనే కాచిగూడ పీఎ్‌సలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-09-06T09:42:29+05:30 IST