అనుమానాస్పదస్థితిలో అన్నాచెల్లెలు అదృశ్యం

ABN , First Publish Date - 2020-10-31T07:56:49+05:30 IST

అనుమానాస్పదస్థితిలో అన్నాచెల్లెలు అదృశ్యం

అనుమానాస్పదస్థితిలో అన్నాచెల్లెలు అదృశ్యం

హయత్‌నగర్‌, అక్టోబర్‌ 30 (ఆంధ్రజ్యోతి): అనుమానాస్పద స్థితిలో అన్నాచెల్లెలు అదృశ్యమైన సంఘటన హయత్‌నగర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కుంట్లూర్‌ రాజీవ్‌ గృహకల్ప బ్లాక్‌ నంబర్‌.5 రూం నంబర్‌.15లో నివాసం ఉండే సౌమ్య కుమారుడు శ్రీపాల్‌(13కుమార్తె ప్రేమ(11) గురువారం రాత్రి భోజనం చేసి ఇంట్లోకి వెళ్లి పడుకున్నారు. శుక్రవారం ఉదయం తల్లి సౌమ్య నిద్ర లేచి చూసే సరికి ఇద్దరు కనిపించలేదు.


దీంతో ఆమె చుట్టు పక్కల వెతికినా ఫలితం లేక పోవడంతో శుక్రవారం సాయంత్రం హయత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సౌమ్య భర్త ఆనందకుమార్‌ కొంతకాలంగా భార్యకు దూరంగా ఉంటున్నాడు. పోలీసులు ఆనందకుమార్‌కు ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ వచ్చింది. పిల్లలను ఆనందకుమార్‌ తీసుకు పోయి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Read more