జర్నలిస్టుల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తా

ABN , First Publish Date - 2020-09-03T10:15:07+05:30 IST

ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల న్యాయపరమైన డిమాండ్లను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ అన్నారు

జర్నలిస్టుల డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తా

రాంనగర్‌, సెప్టెంబర్‌ 2 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల న్యాయపరమైన డిమాండ్లను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ అన్నారు. బుధవారం బాగ్‌లింగంపల్లిలోని హౌస్‌ఫెడ్‌ కార్యాలయంలో కరోనా వారియర్స్‌గా పనిచేస్తున్న జర్నలిస్టులను హౌస్‌ఫెడ్‌ డైరెక్టర్‌ కిషన్‌రావు, సామాజిక కార్యకర్తలు కందూరి కృష్ణ, దామోదర్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్‌గౌడ్‌ల ఆధ్వర్యంలో సన్మానించారు. అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గోపాల్‌ మాట్లాడుతూ కరోనా వారియర్స్‌గా పనిచేస్తున్న డాక్టర్లు, పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బందికి ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు జర్నలిస్టులకూ అందాల్సిన అవసరం ఉందన్నారు.


జర్నలిస్టులకు ఉచిత కార్పొరేట్‌ వైద్యం అందే విధంగా కృషి చేస్తామని అన్నారు. ముషీరాబాద్‌ వర్కింగ్‌ జర్నలిస్టు అసోసియేషన్‌ చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకమని అన్నారు. జర్నలిస్టులకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు వచ్చేందుకు తమవంతు సహకారం అందిస్తామన్నారు. కార్పొరేటర్‌ శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతూ కరోనా వారియర్స్‌గా పనిచేస్తున్న జర్నలిస్టుల హెల్త్‌ కార్డులకు తమవంతు సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ యువజన నాయకుడు ముఠా జైసింహ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-03T10:15:07+05:30 IST