తాళం వేసిన ఇళ్లలో చోరీలు చేస్తున్న పాత నేరస్థుడి అరెస్టు

ABN , First Publish Date - 2020-03-13T09:59:19+05:30 IST

తాళం వేసిన ఇళ్లే అతడి లక్ష్యం. రెక్కీ నిర్వహించి రాత్రిపూట తాళాలు పగులగొట్టి బంగారు నగలు, నగదు అపహరించి పారిపోతున్న పాత నేరస్థుడిని ఎస్సార్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు.

తాళం వేసిన ఇళ్లలో చోరీలు చేస్తున్న  పాత నేరస్థుడి అరెస్టు

19 తులాల బంగారు నగలు స్వాధీనం 


అమీర్‌పేట, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): తాళం వేసిన ఇళ్లే అతడి లక్ష్యం. రెక్కీ నిర్వహించి రాత్రిపూట తాళాలు పగులగొట్టి బంగారు నగలు, నగదు అపహరించి పారిపోతున్న పాత నేరస్థుడిని ఎస్సార్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ. 8 లక్షల విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. గురువారం విలేకరుల సమావేశంలో పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ వివరాలు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా, అమలాపురం మండలం, కొంపల్లి గ్రామానికి చెందిన పత్తివాడ లవరాజు అలియాస్‌ లవరాజు ఏడాది క్రితం నగరానికి వచ్చాడు. హయత్‌నగర్‌ మండలం, తొర్రూర్‌లో నివసిస్తూ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల మఽధురానగర్‌లో తాళం వేసిన ఇంట్లోచోరీ జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు పాత నేరస్థులపై దృష్టి సారించి ఘటనా స్థలంలోగల సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు.


అందులో నమోదైన వ్యక్తి కదలికలను గుర్తించి వెంగళరావునగర్‌ డివిజన్‌, జవహర్‌నగర్‌లో ఆటో నడిపిస్తున్న లవరాజును అదుపులోకి తీసుకొని విచారించగా.. మధురానగర్‌లో చోరీ చేసినట్లు అంగీకరించాడు. అతడి నుంచి 19 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకొని నిందితుడిని రిమాండ్‌కు తరలించామని డీసీపీ తెలిపారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత దొంగతనాలు చేసి అపహరించిన నగలు అమ్మగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తుంటాడు. అతడిపై అమలాపురంలో 3, శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో ఒకటి, నర్సీపట్నంలో 2, ఎస్‌ఆర్‌నగర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఒక కేసు నమోదైంది. విలేకరుల సమావేశంలో ఏసీపీ తిరుపతన్న, సీఐ మురళీకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2020-03-13T09:59:19+05:30 IST