‘సచివాలయ ప్రాంగణంలో ఆలయాలు నిర్మించాలి’

ABN , First Publish Date - 2020-09-06T09:47:02+05:30 IST

సచివాలయ ప్రాంగణంలోని ఆలయాలను కూల్చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు అదే ..

‘సచివాలయ ప్రాంగణంలో ఆలయాలు నిర్మించాలి’

మంగళ్‌హాట్‌, సెప్టెంబర్‌ 5(ఆంధ్రజ్యోతి): సచివాలయ ప్రాంగణంలోని ఆలయాలను కూల్చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు అదే స్థానంలో ఆలయాలను నిర్మించాలని.. లేనిపక్షంలో విశ్వహిందూ పరిషత్‌ కరసేవ నిర్వహించి ఆలయాలను నిర్మిస్తుందని వీహెచ్‌పీ రాష్ట్ర నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు, కార్యదర్శి బండారి రమేష్‌ బహిరంగ లేఖ రాశారు. యఽథాస్థానంలో ఆలయాలను నిర్మించేందుకు పీఠాధిపతులు, స్వామీజీలు, ఽథార్మిక, ఆధ్యాత్మిక సంస్థలతో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రకటించాలన్నారు. 

Updated Date - 2020-09-06T09:47:02+05:30 IST