తెలంగాణ సారస్వత పరిషత్తు కళాశాలలో తెలుగు కోర్సులు

ABN , First Publish Date - 2020-08-22T09:48:25+05:30 IST

తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రాచ్యకళాశాలలో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు

తెలంగాణ సారస్వత పరిషత్తు కళాశాలలో తెలుగు కోర్సులు

అఫ్జల్‌గంజ్‌, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రాచ్యకళాశాలలో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. తెలుగు భాషా సాహిత్యంలో పీడీసీ డిగ్రీ కోర్సు, బీఏ, ఎంఏ కోర్సులు నిర్వహిస్తున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైనవారు రెండేళ్ల కోర్సుకు అర్హులు. ఇంటర్‌ పాసైనా బీఏ, డిగ్రీ ఆన్‌లైన్‌ పద్ధతుల్లో ప్రవేశం పొందవచ్చు. తెలుగు ద్వితీయ భాషలో పాసైనవారు ఎంఏ కోర్సుకు అర్హులు. ఆసక్తి కల్గిన విద్యార్థులు సాయంత్రం 5 నుంచి రాత్రి 9 వరకు తరగతులకు హాజరుకావచ్చని ప్రఽధాన కార్యదర్శి జె.చెన్నయ్య పేర్కొన్నారు. వివరాలకు.. ఫోన్‌ నెం. 9441085114, 9032812971లను సంప్రదించాలన్నారు.

Updated Date - 2020-08-22T09:48:25+05:30 IST