ఎవరి నుంచి ముప్పు ఉందో చెప్పండి

ABN , First Publish Date - 2020-09-01T10:35:09+05:30 IST

తనకు ఎవరి నుంచి ముప్పు పొంచి ఉందో చెప్పాలని హోంమంత్రి మహమూద్‌ అలీని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కోరారు. భద్రతా కారణాలవల్ల

ఎవరి నుంచి ముప్పు ఉందో చెప్పండి

 పెండింగ్‌లో ఉంచిన గన్‌ లైసెన్స్‌ ఇవ్వండి

 హోంమంత్రిని కోరిన ఎమ్మెల్యే రాజాసింగ్‌


హైదరాబాద్‌, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): తనకు ఎవరి నుంచి ముప్పు పొంచి ఉందో చెప్పాలని హోంమంత్రి మహమూద్‌ అలీని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కోరారు. భద్రతా కారణాలవల్ల ద్విచక్ర వాహనంపై తిరగొద్దని రాజాసింగ్‌కు ఇటీవల హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హోం మంత్రిని ఆయన కార్యాలయంలో ఎమ్మెల్యే రాజాసింగ్‌ సోమవారం కలిశారు.


తనకు ముప్పు ఉందని చెబుతున్న పోలీసులు ఆత్మరక్షణ కోసం తాను దరఖాస్తు చేసుకున్న గన్‌ లైసెన్స్‌ను రెండేళ్లుగా పెండింగ్‌లో ఉంచారని హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయమై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

Updated Date - 2020-09-01T10:35:09+05:30 IST