నేటి నుంచి తెలంగాణలో రైతుబంధు పథకం

ABN , First Publish Date - 2020-12-28T13:14:03+05:30 IST

తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి రైతుబంధు పథకం ప్రారంభంకానుంది. వచ్చే నెల వరకు రైతుబంధు కింద ఆర్థికసాయం కొనసాగనుంది.

నేటి నుంచి తెలంగాణలో రైతుబంధు పథకం

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి  రైతుబంధు పథకం ప్రారంభంకానుంది. వచ్చే నెల వరకు  రైతుబంధు కింద ఆర్థికసాయం కొనసాగనుంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.  ఈ పథకం కింద 61.49 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. గత వానాకాలం సీజన్‌లో రైతు బంధు కింద రూ.7,251కోట్లు పంపిణీ చేయగా, యాసంగిలో రూ.7,300కోట్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. 

Updated Date - 2020-12-28T13:14:03+05:30 IST